Songs of Worship

A collection of Christian songs composed by PSD Raju, written to glorify God and encourage believers through worship.

Song Cover

నీ పాట నాకు ప్రాణం

నీ పాట నాకు ప్రాణం- నీ మాట నాకు మధురం నీ భాట నాకు మార్గం

▶ Watch

నీ పాట నాకు ప్రాణం- నీ మాట నాకు మధురం

నీ పాట నాకు ప్రాణం- నీ మాట నాకు మధురం నీ భాట నాకు మార్గం - అవి ఇచ్చు నాకు నీ జీవం నా దేవా నా దేవా - నన్ను ఇలలో నడుపుమయ యేసయ్యా యేసయ్యా- నాతో నడువుమయా 1 అంధకార మందలి నన్ను - పేరుపెట్టి పిలచినావు ఆశ్చర్యమైన వెలుగులో - నన్ను నీవు నిలిపినావు నీ సిలువ మార్గమును నీవు - నాకు చూపించినావు నా సిలువనెత్తుకొని నేను- నిన్ను వెంబడించవాలె నన్నావు 2 స్తుతులకు పాత్రుడా - అద్వితీయ పుత్రుడా మహిమ స్వరూపుడా- కృపా సత్య పూర్ణుడా నీ ఇరుకు ద్వారమును నీవు - నాకు చూపించావు విశాల ద్వారమును విడచి - నిన్ను వెంబడించవలె నన్నావు

Song Cover

ఆశ్చర్యకారుడు

ఆశ్చర్యకారుడు - ఆ ప్రభు యేసుడు ఆపదలో మనలన్ - ఆదుకునేవాడు

▶ Watch

ఆశ్చర్యకారుడు - ఆ ప్రభు యేసుడు

ఆశ్చర్యకారుడు - ఆ ప్రభు యేసుడు ఆపదలో మనలన్ - ఆదుకునేవాడు కనికరపూర్ణుడు - ఆ కరుణామయుడు కష్టాలలో మనలన్ - కాపాడు వాడు 1 గలిలయ సంద్రమున - సాయంకాల సమయమున శిష్యులు నావపై - పయనమై పోగా నాల్గోవా జామున - నడి సంద్రమున గాలి తూఫానులో - చిక్కుబడి పోగా నీటి పై నడచుచు - యేసయ్య వచ్చెను నావలో నిలిచెను - వారిని అద్దరికి చెర్చెను 2 యెరికో పట్టణమున - యెరుశలేము మార్గమున యేసయ్య శిష్యులతో - పయనమై పొగ దారి కానరాని - గృడి వారు ఇరువురు దావీదు కుమారుడా - దయచూపుమనగా యేసయ్య చూచెను - త్రోవలో నిలిచెను కనికరము చూపెను - వారి కన్నులను తేరిచెను

Song Cover

యోగ్యతగల యువకునికి

యోగ్యతగల యువకునికి భాగ్యముగల కన్యకను దేవుడు ఇచ్చే బహుమానం సాటిలేని సహాయం

▶ Watch

యోగ్యతగల యువకునికి భాగ్యముగల కన్యకను

యోగ్యతగల యువకునికి భాగ్యముగల కన్యకను దేవుడు ఇచ్చే బహుమానం సాటిలేని సహాయం

Song Cover

విజయమునందు

విజయమునందు మరణపుముల్లు విరచివేసెను విజయుడై క్రీస్తుయేసు

▶ Watch

విజయమునందు - మరణపు ముల్లు - విరచివేసెను

విజయమునందు - మరణపు ముల్లు - విరచివేసెను విజయుడై - క్రీస్తు యేసు తిరిగిలేచెను సమాధిఁ గెలచిలేచెను వేకువనే స్త్రీలు లేచి - సుగంధాలు సిద్ధము చేసి నిద్రించిన యేసయ్య ను - చూడ వెళ్లి రీ సమాధి వద్ద చెరిరి ఖాళీ సమాధిని చూసి - యేసయ్య లేడని తెలసి ఆశ నిరాశల మధ్య- దారి మళ్లీరి- భయపడి పారిపో ఇరి మూడవ దినమున - లేచెదెనన్నమాటను మరిచిరి క్రీస్తుని బాటను విడిచిరి మగ్దలీనా మరియ ఒక్కతే - సజీవునిగా యేసు నీ చూచి రబ్బూని రబ్బూని అని సంతసించెను- ప్రభుని ప్రస్తుతించెను యేసయ్య లేచాడంటే- గాయలు చూడలంటూ నమ్మనెనమ్మనని దీదుమా పలికెను- విశ్వాసము విడిచెను చూచి నమ్ముట కాదు నన్ను- చూడక నమ్మాలి అని ప్రభువే తెలిపెను - వారికి ధాన్యతనిచెను మృత్యులనుండి లేచినవాడు - మరణమును జయించినవాడు సజీవునిగా నిలచిన వాడు - శ్రీ యేసుడే ఉత్తాన శక్తి చేత - సృష్టికెల్ల ప్రకటించుటకు శుభవర్తను పంపిన వాడు - ఆ క్రేస్తుడే అంతముకాదిది- ఆరంభమని - పయనమైపోయిరి శిష్యులు క్రీస్తునే చాటిరి-క్రీస్తుని బాటనే నడిచిరి

Song Cover

నాతో నివసించే - ఓ యేసయ్య

నాతో నివసించే - ఓ యేసయ్య నిన్ను విడచి - నేనుండ లేనయ్యా

▶ Watch

నాతో నివసించే - ఓ యేసయ్య

నాతో నివసించే - ఓ యేసయ్య నిన్ను విడచి - నేనుండ లేనయ్యా నన్నాదరించే నా యేసయ్య నిన్ను మరచి- నేనుండ లేనయ్యా చీకటి ముసిరిన - సమయమది వెలుగై నిలిచావు మరణ బాధల - సమయమది జీవమై నిలిచావు కన్నీరోలికె - సమయమది తల్లిగా నిలిచావు ఆర్థిక బాధలు - సమయమది తండ్రిగా నిలిచావు నీ వాక్యం చదివే - సమయమది రబ్బూనిగా నిలిచావు నిన్ను ప్రార్ధించే - సమయమది వర దాతగా నిలిచావు హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా

Song Cover

నీ సంపద నంత చూచి

నీ సంపద నంత చూచి - నీ సంపాదన అని తలచి

▶ Watch

నీ సంపద నంత చూచి - నీ సంపాదన అని తలచి

నీ సంపద నంత చూచి - నీ సంపాదన అని తలచి నీ దశమ భాగము - దేవునికియ్యక దాచుకొందు వా - దేవుని దోచుకొందువా 1 కలిమికొలది ఇచ్చినది - దేవునికే ప్రీతికరం అది నీకే నీతికరం - అది నీకే నీతికరం ఉత్సాహముగా ఇచ్చినది- దేవునికే ప్రేమకరం అధి నీకే దైవ వరం - అధి నీకే దైవ వరం శక్తి కొలది ఇచ్చినది - ఓ... శక్తి కొలది ఇచ్చినది నీకే ముక్తికరం అది పాప విముక్తికరం - అది పాప విముక్తికరం 2 సంతోషముగా ఇచ్చుటకు - ప్రభు సన్నిధి చేరుము నీకు సమృద్ధి కలుగును - నీకు సమృద్ధి కలుగును ధారాళముగ ఇచ్చుటకు - ప్రభు చెంత చేరుము నిన్ను వర్ధిల్ల చేయును - నిన్ను వర్ధిల్ల చేయును కృతజ్ఞ తార్పణ ఇచ్చినచో - ఓ... – కృతజ్ఞ తార్పణ ఇచ్చినచో - కృప నీకు వచ్చును కృప వెంబడి కృప వచ్చును - కృప వెంబడి కృప వచ్చును నీ సంపద నంత చూచి - నిజ దేవుడిచేనని తలచి నీ దశమ భాగము దేవునికిచ్చి- స్తుతి చెల్లించుము నీ విరిగి నలిగిన హృదయమును - ఆయనకే అర్పించుము ప్రతిష్ఠి తార్పణ తెచ్చి- ప్రధమ ఫలములనిచ్చి పరమ ప్రభుని పరీక్షించిన - దీవెనలనిచ్చును పరలోక ద్వార లు తెరచి నీపై – కుమ్మరించును నీపై కుమ్మరించును

Song Cover

పరమ నివాసి

పరమ నివాసి - నజరేతు వాసి - నరరూప ధారి మమ్ము ప్రేమించే మంచి కాపరి

▶ Watch

పరమ నివాసి - నజరేతు వాసి - నరరూప ధారి

పరమ నివాసి - నజరేతు వాసి - నరరూప ధారి మమ్ము ప్రేమించే మంచి కాపరి పాపిని వేదకి - రక్షణ నొసగిన- ఓ సిలువ ధారి విమోచించే మంచి కాపరి 1 నశించిపోయే ఆత్మలను - నరకానికి పోయే పాపులను నలిగిపోయిన హృదయు లను - ఆకలిగొన్న అన్నార్థులను కాపాడే మంచి కాపరి - కాచి కాపాడే మంచి కాపరి 2 మార్గము తప్పిన బ్రష్టులను - దుర్మార్గత నిండిన దుష్టులను నిలకడలేని నిర్భాగ్యులను- నిరీక్షణలేని నిర్జీవులను క్షమియించే మంచి కాపరి - క్షమియించే మంచి కాపరి 3 స్వస్థత లేని రోగులను - చూపు లేని అంధులను నడవలేని బలహీనులను - వినికిడి లేని వికలాంగులను స్వస్థ పరచె మంచి కాపరి - స్వస్థ పరచె మంచి కాపరి

Song Cover

రాకడ దినమదిగో

రాకడ దినమదిగో క్రీస్తుని రాకడ దినమదిగో రెండోవ్ రాకడ దినమదిగో

▶ Watch

రాకడ దినమదిగో క్రీస్తుని రాకడ దినమదిగో

రాకడ దినమదిగో క్రీస్తుని రాకడ దినమదిగో రాకడ దినమదిగో రెండోవ్ రాకడ దినమదిగో బురలద్వాని అదిగో దేవదూత ల స్వరం అదిగో పరలోకమునుండి పరిశుద్ధులతో ఆర్బతముతో వేవేల దూతలతో దేవుని బూరతో అగ్నిజ్వాలాలులో మేఘరూరూడై మధ్యకాశములో యూదః గోత్రపుసింహమై ప్రభువు వచ్చే వెలదిగో నీతిసూర్యుని వెలుగిధిగో నీతిసూర్యుని వెలుగిధిగో క్రీస్తులో మృ తులు మొదటి లే తురు పిదప సజీవులు లేపబడుదురు క్షయమైన శరీరము ఇలాలో విడచి అక్షయ రూపము ప్రభులో ధరించి రూపాంతరమై ప్రభువును చేరే ఆ శుభ వెలదిగో నిత్యజీవపు వెలుగాధిగో నిత్యజీవపు వెలుగాధిగో క్రూర మృగపు పరిపాలనలో అంత్యక్రీస్తు అధికారంలో సాతాను ముద్రతో ఏదేండ్ల శ్రమలతో సోధన భాదలలో జన సంద్రముండగా పరిశుద్ధులకు పరమున ప్రభువు తో విందు వేల అదిగో నిజ దేవుని వెలుగు అదిగో నిజ దేవుని వెలుగు అదిగో

Song Cover

నీ సిలువలో - నిన్ను చూశాను

నీ సిలువలో - నిన్ను చూశాను నా పాపమే - నా కనులకు కనబడెను

▶ Watch

Verse 1

పల్లవి: నీ సిలువలో - నిన్ను చూశాను నా పాపమే - నా కనులకు కనబడెను చిందించిననీ - రుధిరం చూశాను నా దోషమే - నా కనులకు కనబడెను నలిగిపోయిన - నీ రూపం చూశాను నా శాపరూపమే - నా కనులకు కనబడెను నీ సిలువలో - నిన్ను చూశాను నా పాపదోషమే- నా కనులకు కనబడెను చరణం1: నిశిరాత్రివేల నిన్ను - నిర్దయగ నిర్భందించి నిందించిన వారికి - ప్రార్ధించితివి పగబట్టిన పరిసయ్యులను - అబధ్ధికులు, యాజకులను సిలువవేయమన్నవారిని- క్షమియించితివి నీ కనులలో - నేను చూడగా నీ క్షమాగుణములే - నా కనులకు కనబడెను చరణం 2: ఏ పాపమెరుగని నీవు - పాపిగా నిలిచావు ఏ దోషమెరుగని నీవు - నా దోషం భరియించావు లోకపాపమంత తీసి - లోకాన్ని స్వస్థపరచి తండ్రి నుండి దూరమై- ఆక్రోషించావు నీ కనులలో - నేను చూడగా నీ నిర్దోషమే - నా కనులకు కనబడెను ॥నీ సిలువలో॥ చరణం 3: కలువరిలో కార్చిన రక్తం - సిలువలో అర్పించిన ప్రాణం నరవేర్చిన రక్షణ కార్యం - తృప్తిపరచె నీ తండ్రి హృదయం నీ కనులలో - నేను చూడగా నీ సంతృప్తయే - నా కనులకు కనబడెను నా దైవమా - నా యేసయ్యా నే దీనపాపిని- నీ రక్షణ నాకిమ్ము నా జీవమా - నా తేజమా నీ కనికరమును చూపి - నా కనులకు వెలుగిమ్ము

Song Cover

సిలువలో యేసయ్యా

సిలువలో యేసయ్యా వ్రేలాడు వేళలో

▶ Watch

సిలువలో యేసయ్యా వ్రేలాడు వేళలో

Lyrics shall be added here...

Song Cover

మట్లాడకున్నావు

మట్లాడకున్నావు - మౌనముగానున్నావు ఘోరహింస భరియించి

▶ Watch

మట్లాడకున్నావు - మౌనముగానున్నావు

మట్లాడకున్నావు - మౌనముగానున్నావు ఘోరహింస భరియించి - నోరు తెరువుకున్నావు నరులకొరకు నరునిగా- పరము విడిచి వచ్చావు నిజ దైవ కుమారునిగా - ఇల లో జీవించావు అద్భుతములు చేసావు - స్వస్థత లను ఇచ్చావు మానవులను రక్షింప - సిలువను భరియించావు నీ సిల్వనేత్తుకొని - కల్వరికి నడిచావు ఈ లోక శాపాన్ని - వీపుపై మోసావు శ్రమలను సహి యించావు - భాదలు భరీ యించవు అవమానం నొందావు - అవహేళన నోర్చావు ఏ పాపమెరుగని నీవు - పాపముగ మారవు విలువగు నీ రక్తాన్ని - సిలువలో చిందించావు మా రక్షణ కార్యాన్ని - నీ విల నేరవేర్చావు ఘోరమైన మరణాన్ని - నీ వు పొందుకున్నావు సృష్టికర్త రక్షణకర్త - ఆదరణకర్త దేవుడు తన రక్షణ భాగ్యాన్ని - మనకందరికిచ్చినవాడు క్రైస్తవుడా మరచిపోకుమా - కల్వరిలో యేసుని ప్రేమ శుభ వర్తను చాటించు - సృష్టి కెల్ల ప్రకటించు